Amaravathi Jyothi - Sports / : మహ్మద్ షమీకి అర్జున అవార్డ్ ఢిల్లీ, అమరావతి జ్యోతి: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీకి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించింది. అతడితోపాటు వివిధ ఆటల్లో ప్రతిభ చూపిన మరో 26 మందికి ఈ అవార్డులు ప్రకటించింది. APకి చెందిన టీమ్ ఇండియా అంధుల క్రికెట్ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డ్ కు ఎంపికయ్యారు. పవన్ కుమార్ (కబడ్డీ), సునీల్ కుమార్ (రెజ్లింగ్), వైశాలి (చెస్) అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో వీరికి రాష్ట్రపతి ఈ అవార్డ్ అందిస్తారు.
Admin
Amaravathi Jyothi